దేశంలో ముస్లింలు 20 కోట్ల మంది.. అంచనా వేసిన కేంద్రం

దేశంలో ముస్లింలు 20 కోట్ల మంది.. అంచనా వేసిన కేంద్రం

దేశంలో ముస్లింల జనాభా 20 కోట్లకు చేరినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ లోకసభ వేదికగా వెల్లడించారు. 2023 నాటికి దేశంలో ముస్లిం జనాభా ఎంతన్న దానిపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు.. ఆమె ఈ విధంగా బదులిచ్చారు.

2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం(17.2 కోట్లు) ఉన్నారని తెలిపిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. 2023 నాటికి వారి జనాభా 19.7 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడినట్లు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.. అయితే, దేశంలోని పస్మాండ ముస్లింల జనాభాకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రం మంత్రి సమాధానం ఇవ్వలేదు.

కాగా, జూలై 2020లో అంచనా వేసిన నివేదిక ప్రకారం.. 2023 నాటికి దేశ జనాభా 138.8 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.