స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

ఉత్తరప్రదేశ్ అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు హత్యకు గురయ్యాడు. బరూలియ గ్రామంలో సురేంద్ర సింగ్‌ను ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున రాత్రి దుండగలు కాల్చిచంపారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన క్రమంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు.

వెంటనే ఆయనను స్థానికులు లక్నో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్‌ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు చెబుతామన్నారు. సురేంద్ర సింగ్‌ స్మృతి ఇరానీకి సన్నిహితులని గ్రామస్తులు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మృతి ఇరానీ ఇతడి సేవలు మెచ్చుకుంటూ పలుమార్లు బహిరంగ సభల్లో ప్రస్తావించారు.