భారత్ vs పాక్ మ్యాచ్ ఒక్కటే కాదు.. వరల్డ్ కప్కి హైప్ ఇవ్వండి.. స్మృతి మంధాన బోల్డ్ కామెంట్స్!

భారత్ vs పాక్ మ్యాచ్ ఒక్కటే కాదు.. వరల్డ్ కప్కి హైప్ ఇవ్వండి.. స్మృతి మంధాన బోల్డ్ కామెంట్స్!

Smriti Mandhana: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్రికెట్ ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. సాధారణంగా క్రికెట్ టోర్నమెంట్ ఏదైనా సరే.. అందరి ఫోకస్ కేవలం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంటుంది. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌నే కాకుండా టోర్నీ మొత్తాన్ని సమానంగా ప్రమోట్ చేయాలని, వరల్డ్ కప్ మొత్తానికి భారీ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని స్మృతి పిలుపునిచ్చింది.

ఈ రెండు ప్రత్యర్థి జట్ల మధ్య జూలై 14వ తేదీన బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో గ్రూప్-A మ్యాచ్ జరగనుంది. ఈ మెగా పోరుకు సంబంధించిన టికెట్లు అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్మృతి మంధాన మాట్లాడుతూ.. గతంలో బర్మింగ్‌హామ్‌లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో మేము పాకిస్తాన్‌తో ఆడినప్పుడు స్టేడియం మొత్తం హౌస్‌ఫుల్ అయ్యింది. కేవలం భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే కాదు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మొత్తాన్ని మనం హైప్ చేయాలి.. ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్‌కు ఎలాగో క్రేజ్ ఉంటుంది.. ఈసారి కూడా మాకు సపోర్ట్ చేయడానికి భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలుసు.. ఖచ్చితంగా గ్రౌండ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తామని పేర్కొనింది. 

ఫామ్ కోల్పోయిన భారత్.. టెన్షన్‌లో ఫ్యాన్స్: 
గతేడాది (2025) హోమ్ గ్రౌండ్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈసారి టీ20 వరల్డ్ కప్‌ను కూడా ముద్దాడాలని కసితో ఉంది. కానీ, ఈ మెగా టోర్నీ కంటే ముందు టీమిండియా ప్రిపరేషన్స్ అంత ఆశాజనకంగా ఏమీ లేవు.. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2–1 తేడాతో చేజార్చుకుంది. తొలి మ్యాచ్ గెలిచి మంచి లీడ్ సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెడుతుంది.  

టీమిండియా రీసెంట్ గ్రాఫ్: 
* ఇంగ్లాండ్ సిరీస్: 2–1తో ఓటమి (వరల్డ్ కప్‌కు ముందు ఆఖరి సిరీస్).
* సౌతాఫ్రికా సిరీస్: 4–1తో ఘోర పరాజయం.
* ఆస్ట్రేలియా పర్యటన: ఇదే ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా గడ్డపై 2–1తో చారిత్రాత్మక సిరీస్ విజయం.
* శ్రీలంక సిరీస్: గత డిసెంబర్‌లో లంకను 5–0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్