నాకు ఎలాంటి సంబంధం లేదు: స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోవడంపై లేడీ కొరియోగ్రాఫర్ క్లారిటీ

నాకు ఎలాంటి సంబంధం లేదు: స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోవడంపై లేడీ కొరియోగ్రాఫర్ క్లారిటీ

ముంబై: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే, పలాష్, స్మృతి పెళ్లి పోస్ట్‎పోన్ వెనక మరో కారణం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‎తో చేసిన చాట్ లీక్ కావడంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందని టాక్ నడుస్తోంది. ఈ వివాదంలో ముఖ్యంగా కొరియోగ్రాఫర్లు మేరీ డీకోస్టా, నందిక ద్వివేది, గుల్నాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై కొరియోగ్రాఫర్ గుల్నాజ్ ఎట్టకేలకు నోరు విప్పింది. 

‘‘నా గురించి, నా స్నేహితురాలు నందిక గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగా మా వల్ల స్మృతి, పలాష్ వివాహం ఆగిపోలేదు.. అసలు ఆ ఇష్యూతో మాకు సంబంధమే లేదు’’ అని క్లారిటీ ఇచ్చింది. 

పలాష్ ముచ్చల్‎తో ఫొటో దిగినంత మాత్రాన అతడితో వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు కాదని స్పష్టం చేసింది. దయచేసి తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని.. తొందరపడి ముందే జడ్జిమెంట్ ఇవ్వొద్దని నెటిజన్లు, మీడియాకు విజ్ఞప్తి చేసింది. గుల్నాజ్ ఎట్టకేలకు మౌనం వీడటంతో ఈ ఇష్యూలో ఆమె ప్రమేయం లేదని క్లారిటీ వచ్చింది.