
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో ఇండియా చివరి బంతి వరకు పోరాడి ఓడిన విషయం తెలిసిందే. 289 పరుగుల భారీ ఛేదనలో స్టార్ ప్లేయర్ స్మృతి మందాన (88), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (70) 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరూ మెరుగ్గా రాణించడంతో భారత్ సునాయసంగా గెలిచేలా కనిపించింది.
కానీ స్మృతి, హర్మన్ ఔట్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఇండియా వైపు ఉన్న విజయం చివరకు ఇంగ్లాండ్‌ను వరించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై ఓటమిపై స్మృతి మందాన కీలక వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ అనంతరం స్మృతి విలేఖర్లతో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌పై ఓటమికి నైతిక బాధ్యత వహించింది. ఓవర్‌కు ఆరు పరుగులు మాత్రమే అవసరమైన దశలో తాను ఔట్ అయ్యానని.. తన పతనంతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందని ఒప్పుకున్నారు. ఆ సమయంలో తన షాట్ సెలక్షన్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని స్మృతి తప్పును అంగీకరించింది.
►ALSO READ | NZ vs ENG: దుమ్ములేపిన సాల్ట్.. దంచికొట్టిన బ్రూక్: రెండో టీ20లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
తన పొరపాటు వల్ల మ్యాచ్ ఓడిపోయినందున ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పింది. ఇంగ్లాండ్‌పై 88 పరుగులు చేసి కీలక ఇన్సింగ్స్ ఆడిన ఓటమితో దానికి అర్ధం లేకుండాపోయిందన్నారు. ఇంగ్లాండ్‌పై చివరిదాకా వచ్చి ఓడిపోయినప్పటికీ.. భారత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుందని స్మృతి ధీమా వ్యక్తం చేసింది. 2025, అక్టోబర్ 23న నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారిస్తామని పేర్కొంది. సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ మాకు ఎంతో కీలకమని తెలిపింది.