బీ కేర్ ఫుల్ : అమెజాన్ పార్సిల్ లో పాము.. బాక్స్ ఓపెన్ చేయగానే బుస్.. బుస్..

బీ కేర్ ఫుల్ : అమెజాన్ పార్సిల్ లో పాము.. బాక్స్ ఓపెన్ చేయగానే బుస్.. బుస్..

ఆన్ లైన్ ఆర్డర్స్ కామన్ అయిపోయాయి.. వస్తువు ఏదైనా.. ఏం కావాలన్నా అమెజాన్ లో ఆర్డర్ చేస్తే ఇట్టే వచ్చేస్తుంది.. అమెజాన్ ఆర్డర్ లో వస్తువులే కాదు పాములు కూడా వస్తున్నాయి.. ఏంటీ షాక్ అయ్యారా వినగానే.. అవునండీ.. మన బెంగళూరులోనే.. ఓ జంట అమెజాన్ ద్వారా X బాక్స్ ఆర్డర్ చేసింది. డెలివరీ వచ్చింది. ఇంటికొచ్చిన బాక్స్ ఓపెన్ చేస్తుంటే బుస్ బుస్ అనే శబ్దాలు వచ్చాయి. అనుమానం వచ్చి.. బాక్సును బకెట్ లో వేసి చూడగా అందులో పాము ఉంది.. అంతే షాక్ అయ్యారు ఇంట్లో వారు.. పరుగులు తీశారు.. అమెజాన్ పార్సిల్ బాక్సులో పాము అనేది వైరల్ అయ్యింది.

 

కర్ణాటక - సర్జాపూర్ పట్టణానికి చెందిన దంపతులు  అమెజాన్‌ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ పెట్టగా అది జూన్  18వ తేదీ మంగళవారం డెలివరీ అయింది.  తప్పుడు ఆర్డర్లు వస్తున్నాయన్న అనుమానంతో  ఆర్డర్ తీసే ముందు వీడియో తీశారు.  బాక్స్‌ ను ఓపెన్ చేయగానే ఎదో బుస్ బుస్ అంట సౌండ్స్ రావడంతో  ఎంటా అని చూడగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిని భయపడ్డారు. అయితే పాము భయటకు రాకుండా ఉండటానికి మధ్యలో అడ్డంగా టేపు ఉండటంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు.లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని వాపోయారు. 

అయితే దీనిపై అమెజాన్ కంపెనీకి ఫిర్యాదు చేయగా..   సొమ్మును రీఫండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు సదరు దంపతులు చెబుతున్నారు.  ఈ పాము  అత్యంత విషపూరితమైన జాతికి చెందినదిగా తెలుస్తోంది.  స్పెక్టాక్‌డ్ కోబ్రాగా గుర్తించబడిన నాగుపామును సురక్షితంగా బయటకు వదిలారు.  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.