శంషాబాద్ లో నర్సరీ స్థలంలో పాములు.. స్థానికుల ఆందోళన

శంషాబాద్ లో నర్సరీ స్థలంలో పాములు.. స్థానికుల ఆందోళన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న నర్సరీ పాములకు నిలయంగా మారుతోంది. కాలనీలో ఐదెకరాల స్థలంలో మునిసిపల్​ అధికారులు నర్సరీని నిర్వహించగా.. కొన్ని రోజుల క్రితం అది మూత పడింది. దీంతో ఆ స్థలంలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు తిరుగుతున్నాయి. 

కాలనీలో ఇండ్ల మధ్యకు అవి వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ స్థలాన్ని కమిటీ హాల్​కు కేటాయించి పిచ్చి మొక్కలను తొలగించాలని  స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.