
ప్రముఖ ఫొటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు (Features) తీసుకొస్తోంది. గతంతో కంటే ఇప్పుడు యూజర్లు మరింత పెరిగారు. ఇతర సోషల్‌మీడియా యాప్స్కంటే వేగంగా ఆప్డేట్అవుతోంది స్నాప్ చాట్. మార్కెట్లో ఇతర పోటీదారులను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది.
2023 సెప్టెంబర్30వ తేదీతో ముగిసే త్రైమాసికంలో రూ.368 మిలియన్ల నికర నష్టాన్ని చవిచూసింది. అయితే.. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే మాత్రం ఇది స్వల్పంగా మెరుగుపడిందంటున్నారు బిజినెస్ నిపుణులు. ఏడాది తర్వాత కంపెనీ చీఫ్ఆపరేటింగ్ఆఫీసర్గా పని చేస్తున్న జెర్రీ హంటర్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్నే కొనసాగించాలని స్నాప్ చాట్సంస్థ భావిస్తోంది. 2024, జులై 1వ తేదీ వరకూ జెర్రీ హంటర్ ను సంస్థలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సీఈఓ ఇవాన్ స్పీగెల్ చెప్పారు.
ఈ ఏడాది మొత్తం ఆదాయం దాదాపు రూ.1.2 బిలియన్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అంతేకాదు.. స్నాప్‌చాట్ వినియోగదారులు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు. స్నాప్ చాట్ సంస్థ.. ఇప్పుడు ఆదాయంపై ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో స్నాప్ చాట్ ను మరింత మెరుగుపర్చాలని.. వినియోగదారులకు ఆప్గ్రేడ్తో కూడిన సేవలు అందించాలని నిర్ణయించింది. డిసెంబర్ త్రైమాసికం వరకు ఇప్పుడున్న 410 మిలియన్ల వినియోగదారులను 412 మిలియన్లకు చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.
ALSO READ:ఆయనకు మాత్రమే లిప్ లాక్.. శ్రీలీల క్రేజీ కామెంట్స్
వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్ లో స్నాప్ చాట్.. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్టాక్వంటి ఫ్లాట్‌ఫామ్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు.. వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ... 368 మిలియన్ల నికర నష్టాన్ని చవిచూసింది సంస్థ.