ఆయనకు మాత్రమే లిప్ లాక్.. శ్రీలీల క్రేజీ కామెంట్స్

ఆయనకు మాత్రమే లిప్ లాక్.. శ్రీలీల క్రేజీ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల(Sreeleela)  హవా నడుస్తోంది. స్టార్ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయింది ఏ బ్యూటీ. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా వచ్చిన ఈ సినిమాను సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కిచాడు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ కు పాజిటీవ్ రిపోర్ట్స్ ఇచ్చారు ఆడియన్స్. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. తాజా సమాచారం ప్రకారం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట. 

ఇందులో భాగంగా చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ ఇంటర్వ్యూ యాంకర్.. ఒకవేళ మీరు లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ స్టార్ తో చేస్తారు అని ప్రశ్నించారు. దానికి బదులుగా శ్రీలీల.. నేను ఎవ్వరితో లిప్ లాక్ చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే డైరెక్ట్‌గా నాకు కాబోయే భర్తతోనే చేస్తాను.. అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబుతో గుంటూరు కారం, నితిన్ తో ఎక్స్ట్రా, వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, నవీన్ పోలిశెట్టితో అనగనగ ఒకరాజు, రవితేజతో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నారు.