మంచుతో నిండిన మనాలి రోడ్డు

మంచుతో నిండిన మనాలి రోడ్డు

హిమాచల్ ప్రదేశ్ రోహ్ తంగ్ పాస్ దగ్గర మంచును క్లియర్ చేస్తున్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనాలి, లేహ్ రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో జనం నడుచుకుంటూనే రోహ్ తంగ్ పాస్ దగ్గర రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున మంచు కురవడం, వాటితో పాటే మంచు చరియలు విరిగిపడడంతో రోడ్డు మార్గం మంచుతో నిండిపోయింది. దీన్ని పలుసార్లు తొలగించినా మళ్లీ మంచు చరియలు విరిగిపడి ప్రయాణాలకు ఆటంకం కలిగింది. ఇప్పుడు మరో విడత స్నో క్లియరెన్స్ చేస్తున్నారు.