లవ్‌‌‌‌ మీలో చాలా స‌‌‌‌ర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉన్నాయి : ఆశిష్

లవ్‌‌‌‌ మీలో చాలా స‌‌‌‌ర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉన్నాయి : ఆశిష్

ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌‌‌‌ మీ’.  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.  యూట్యూబ్‌‌‌‌లో స్టోరీస్ అప్‌‌‌‌లోడ్ చేసే హీరో ద‌‌‌‌గ్గరికి ఓ దెయ్యానికి సంబంధించిన స్టోరీ వ‌‌‌‌స్తుంది. అప్పుడు అత‌‌‌‌ని జీవితంలో ఏం జ‌‌‌‌రిగింద‌‌‌‌నేదే క‌‌‌‌థ‌‌‌‌. డైరెక్టర్ అరుణ్ స్టోరీ చెప్పినప్పుడు థ్రిల్లింగ్‌‌‌‌గా అనిపించింది. 

అలాగే ఈ కథను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ గారికి వినిపిస్తే వాళ్లకు బాగా నచ్చింది.  ఇద్దరు సీనియర్ టెక్నీషియన్స్  మా సినిమా చేయ‌‌‌‌టానికి ఒప్పుకోవటంతో క‌‌‌‌థ కచ్చితంగా కొత్తగా ఉంద‌‌‌‌నిపించింది. అందరు అనుకున్నట్టు ఇందులో వైష్ణవి దెయ్యం కాదు.  దివ్యావ‌‌‌‌తి దెయ్యం పాత్రలో న‌‌‌‌టించింది. అలాగే ఐదారుగురు హీరోయిన్స్  కనిపిస్తారు. వారు ఎవరనేది సినిమాలో చూడాల్సిందే. ఇంకా చాలా స‌‌‌‌ర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌లు ఉన్నాయి.  ప్రేక్షకులు  కచ్చితంగా డిఫ‌‌‌‌రెంట్ మూవీ చూశామ‌‌‌‌ని థియేట‌‌‌‌ర్ నుంచి బ‌‌‌‌య‌‌‌‌ట‌‌‌‌కు వస్తారు’ అని చెప్పాడు.