Naga Chaitanya, Sobhita: నాగ చైతన్య, శోభిత రిలేషన్ పై క్లారిటీ.. వైరల్ అవుతున్న యూరప్ ఫోటోస్

Naga Chaitanya, Sobhita: నాగ చైతన్య, శోభిత రిలేషన్ పై క్లారిటీ.. వైరల్ అవుతున్న యూరప్ ఫోటోస్

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) రెండో పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన హీరోయిన్ శోభిత(Shobhita)తో రిలేషనల్ లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. విదేశాల్లో వీరికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎదో నడుస్తుందని అనుకున్నారంతా. కానీ, అటు నాగ చైతన్య నుండి కానీ, ఇటు శోభితా నుండి కానీ ఈ వార్తలపై ఎలాంటి స్పందన రాలేదు. 

దాంతో.. ఈ ఇద్దరి పెళ్లి వార్త కొన్నిరోజులుగా సైలెంట్ అయ్యింది. అయితే.. తాజాగా మరోసారి ఈ ఇద్దరి రేలషన్ షిప్ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. వీరికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా, శోభితతో నాగచైతన్య యూరప్ ట్రిప్‌ వెళ్లారు. అక్కడ.. ఓ వైన్ టెస్ట్ పార్టీకి వీరిద్దరూ కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో వీరిద్దరూ పక్కపక్కనే నిలబడుకొని కనిపించారు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్.. వీరు రిలేషన్ షిప్ లో ఉన్నది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాకే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాడు అనేది చూడాలి.