
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 150 నీట్ ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇస్టిట్యూషన్స్ స్టూడెంట్స్. నీట్ 2019 ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇష్టంతో ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతామంటున్నారు విద్యార్ధులు. ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందితే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు సమాజానికి సేవ చేస్తామన్నారు.
నీట్ ఫలితాల్లో సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ విద్యార్దులు ఉత్తమమైన ప్రతిభ చూపించారని చెప్పారు గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలల సెక్రటరీ ప్రవీణ్ కుమార్. ఈ ఏడాది 150 సీట్లు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు.