సాధువు కోసం సోషల్ డిస్టెన్స్ మర్చిపోయిన జనం

సాధువు కోసం సోషల్ డిస్టెన్స్ మర్చిపోయిన జనం
  • మధ్యప్రదేశ్‌లోని బందాలో
  • సోషల్‌ డిస్టెన్స్ పాటించని జనం

బందా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని, జనం గుమిగూడవద్దని, పెళ్లిలు, పూజా కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని ఎంత చెప్పినా కొన్ని చోట్ల జనం వినడం లేదు. ఏదో ఒక కారణంతో పిచ్చిపనులు చేస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌ సాగర్‌‌ జిల్లా బందాలో ప్రమణ్‌సాగర్‌‌ అనే ఒక సాధువుకు వెల్‌కమ్‌ చెప్పేందుకు జనం పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. కరోనా వస్తుందనే భయం లేకుండా.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. మాస్కులు వేసుకోకుండా జనమంతా పెద్ద ఎత్తున ఒకే చోట ఉన్న ఫొటోలు లోకల్‌ మీడియాలో ప్రసారమయ్యాయి. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేశామని ఏసీపీ ప్రవీణ్‌ భూరియా చెప్పారు. 144 సెక్షన్‌ వయోలేషన్‌ కింద కేసు పెట్టినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 3986 కేసులు నమోదు కాగా.. 225 మంది చనిపోయారు. వాటిలో సాగర్‌‌ జిల్లాలోనే 10 కేసులు ఉన్నాయి.