సోషల్ మీడియా స్టార్ లీనా నగ్వాన్షీ ఆత్మహత్య

సోషల్ మీడియా స్టార్ లీనా నగ్వాన్షీ ఆత్మహత్య

ప్రముఖ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఘటన మరువకముందే.. మరో సోషల్ మీడియా స్టార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ గఢ్ జిల్లాకు చెందిన 23 ఏండ్ల లీనా నగ్వాన్షీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‭గా ఉంటుంది. ఇన్‭స్టాగ్రామ్‭లో ఆమెకు ఏకంగా 10వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. లీనా ప్రస్తుతం బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువుకునేందుకని ఇంటి టెర్రస్‌పైకి వెళ్లిన లీనా..చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు లీనాని కిందకి దించి చూడగా.. అప్పటికే ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

లీనా ఆత్మహ్యతకు గల కారణాలు తెలియరాలేదని.. సూసైడ్‌ నోట్‌ కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా లీనా ఫోన్‌ సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.