ఈ బ్యూటీ సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

ఈ బ్యూటీ సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

న్యూఢిల్లీ: ప్రపంచంలో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌‌గా అమెరికన్ నటి సోఫియా వెర్గర్ నిలిచింది. ఫోర్బ్స్ తాజా లిస్ట్ ప్రకారం గతేడాదిలో సోఫియా 43 మిలియన్ డాలర్లను ఆర్జించడం విశేషం. దీని విలువ ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.315 కోట్లు. సోఫియా తర్వాత స్థానాల్లో హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ ఏంజెలీనా జోలి (35.5 మిలియన్లు), గల్ గడోట్ (31 మిలియన్లు), మెలిస్సా మెకెర్తీ (25 మిలియన్లు) నిలిచారు. సోఫియా సంపాదనలో ఎక్కువ మొత్తం అమెరికాస్ గాట్ ట్యాలెంట్, మోడర్న్ ఫ్యామిలీతో కుదుర్చుకున్న ఎండార్స్‌‌మెంట్ల నుంచి వచ్చిందని సమాచారం. అమెరికాస్ గాట్ ట్యాలెంట్‌‌లో ప్రతి ఎపిసోడ్‌‌కు సోఫియా 5 లక్షల డాలర్లను ఇచ్చారని తెలుస్తోంది. ఫోర్బ్స్ ఫిమేల్ యాక్ట్రెస్ లిస్ట్‌‌లో ఒక్క ఇండియన్ నటికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.