సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తిరుమల ఎస్టేట్ లోని రెండవ అంతస్తులో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. మంటలను చూసిన ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని క్సైడిస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆఫీస్ లో అక్టోబర్ 12 2023 అగ్నిప్రమాదం జరిగింది. తెలుగు అకాడమీ ఎదురుగా ఉన్న తిరుమల ఎస్టేట్ లోని రెండవ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కిటికీల్లోంచి మంటలు ఎగిసిపడటంతో.. చుట్టుపక్కన ఉండే స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. పక్కన బిల్డింగుల్లో ఉన్న జనాలు కూడా బయటకు పరుగులు తీశారు. 

సర్వర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో.. కార్యాలయంలోని కంప్యూటర్లు కాలిపోయాయి. ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను అదుపు చేశారు. బిల్డింగ్ ఐదు అంతస్తులు కావడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీనితో బిల్డింగ్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది ధ్వంసం చేశారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.