పార్టీ అని పిలిచి.. హోటల్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం

పార్టీ అని పిలిచి.. హోటల్ లో సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం

హైదరాబాద్ సిటీలో ఘోరం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ఓ యువతిని.. పార్టీకి అని పిలిచి.. హోటల్ లో అత్యాచారం చేశారు ఇద్దరు యువకులు. 2024, జూలై 30వ తేదీ ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువతికి తెలిసిన వారే ఆ ఇద్దరు యువకులు అని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది ఆ యువతి. తనకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి వనస్థలిపురంలోని ఓ హోటల్ లో మంచి పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే యువతి వెంట ఉన్న గౌతం రెడ్డి మద్యం  సేవించాడు. ఆ తర్వాత హోటల్ లోనే ఆ యువతిపై అత్యాచారం చేశారు. సాఫ్ట్ వేర్ యువతి వద్దని వారిస్తున్నా.. బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేశారు. 

తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని యువతి పోలీసులకు కంప్లయింట్ చేసింది. తనకు తెలిసిన స్నేహితుడితో పాటు మరొకరు.. తనపై అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సాఫ్ట్ వేర్ యువతి స్నేహితుడు, మరొకరి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే పట్టుకుంటాం అని చెబుతున్నారు పోలీసులు. వనస్థలిపురంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ ఘోరం జరిగింది. హోటల్ కు వెళ్లిన పోలీసులు.. అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు.