మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం

మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం

మియాపూర్లో  ఓ సాఫ్ట్వేర్  ఉద్యోగి అదృశ్యమయ్యాడు.  భార్య మాధవితో కలిసి ఉంటున్న కేవీ ప్రసాద్ రెడ్డి(46)..  ఓ సాఫ్ట్వేర్  కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.  ఆఫీసుకు వెళ్తున్నాని చెప్పి ఏప్రిల్ 22వ తేదీ సోమవారం  ఉదయం బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదు. పైగా ఫోన్ కూడా ఇంట్లోనే మరిచిపోయాడు. ఎంతసేపటికీ భర్త ఆచూకీ లభించకపోవడంతో కంగారు పడ్డ మాధవి....ప్రసాద్ రెడ్డి పనిచేస్తున్న ఆఫీసుకు ఫోన్ చేసి ఆరా తీయగా.. ప్రసాద్ ఈ రోజు ఆఫీసుకు రాలేదని  తెలుసుకుంది.  దీంతో వెంటనే మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మాధవి.  ప్రసాద్ రెడ్డి గతంలో కొన్ని అనారోగ్య కారణాలతో కింద పడిపోయినట్లుగా మాధవి పోలీసులకు తెలిపింది.  మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.