మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో హరిణి (24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. హరిణి స్వస్థలం మహబూబ్‌నగర్‌లోని జగదాంబ కాలనీ. మాదాపూర్‌లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో హరిణి రెండున్నర సంవత్సరాల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. హరిణి గచ్చిబౌలిలోని వెంకటేశ్వర ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేది. ఆమె పనిచేస్తున్న కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. హరిణికి వచ్చే నెల డిసెంబర్‌తో కాంట్రాక్ట్ ముగుస్తుంది. దాంతో తన ఉద్యోగం పోతే మరో ఉద్యోగం రాదేమోనన్న భయంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ యాజమాన్యం ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి