హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం (నవంబర్ 30) రాత్రి స్నేహితుడి దగ్గరకు బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. గోల్నాక వద్ద బ్రిడ్జిపై నుంచి కిందపడి శిరీష్ అనే సాఫ్ట్ వేర్ మృతి చెందాడు. నారాయణగూడ ప్రాంతానికి చెందిన అశోక్ గుప్త కుమారుడు శిరీష్ వృత్తిరిత్యా పూనేలో సాప్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం అర్ధరాత్రి శిరీష్ తన ఎలక్ట్రికల్ బైక్ పై గోల్నాక నుండి స్నేహితుడు ఉండే రామంతాపూర్ కు వెలుతుండగా జరిగింది ఘటన. మార్గమధ్యలో అంబర్ పేట్ బ్రిడ్జిపై నుంచి బైక్ అదుపుతప్పి కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శిరీష్ మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. తండ్రి అశోక్ గుప్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
