అమ్మకానికి మహాత్ముడి కళ్లద్దాలు.. సూపర్ రెస్పాన్స్‌!

అమ్మకానికి మహాత్ముడి కళ్లద్దాలు.. సూపర్ రెస్పాన్స్‌!

ొంలండన్: సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను  యూకేలోని బ్రిస్టల్‌లో వేలానికి పెట్టారు. ఇవి 260,000 పౌండ్లకు అమ్ముడుపోవడం విశేషం. అయితే అద్దాలను వేలంలో ఉంచిన వ్యక్తి వీటి విలువను గుర్తించకుండా ఎన్వెలప్‌ను లోకల్ ఆక్షనర్‌‌ దగ్గరే వదిలి వెళ్లిపోవడం గమనార్హం. ఈ అద్దాలను అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని వ్యక్తి దక్కించుకున్నాడు. వీటిని వేలంలో తొలుత 15,000 పౌండ్ల ధరకే రిజర్వ్ చేశామని ఆక్షనర్ ఆండీ స్టోవ్ చెప్పాడు.

‘ఇండియాతో సహా చాలా దేశాలకు చెందిన కొందరు ఈ అద్దాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. దీంతో ధర ఒక్కసారిగా పెరిగింది. ఇది అద్భుతమైన ఫలితం! గత యాభై ఏళ్లుగా ఈ అద్దాలు సొరుగులో నిద్రావస్థలో ఉన్నాయి. ఇవి పనికి రానివైతే విసిరి పారేయమని వీటిని నాకు అమ్మిన వ్యక్తి చెప్పాడు. కానీ ఇప్పుడు వీటితోనే అతడు తన జీవితాన్ని మార్చేంత డబ్బులను దక్కించుకున్నాడు. వీటిని వేలంలో ఉంచాలని ఇచ్చిన సదరు వృద్ధుడు గత కొన్నేళ్లుగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కానీ ఇప్పుడు అతడి జీవితం నమ్మశక్యం కాని విధంగా మారిపోనుంది. అద్భుతమైన ధర పలికింది. కానీ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు’ అని స్టోవ్ వివరించాడు.