సోలో బాయ్ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

సోలో బాయ్ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

‘బిగ్‌‌‌‌ బాస్’ ఫేమ్ గౌతమ్  కృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోలో బాయ్’.  పి నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మిస్తున్నారు. బుధవారం ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో గౌతమ్ బ్యాగ్ తగిలించుకుని సాఫ్ట్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.

బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో చాలామంది మనుషులు కనిపిస్తుండటం ఆసక్తిని పెంచింది.  శ్వేత, రమ్య పసుపులేటి  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ, భద్రం ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆకాశ వీధిలో’ తర్వాత తను నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాడు గౌతమ్ కృష్ణ.  యూత్‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌ని అలరించేలా  ఈ చిత్రం ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు.