ఒక్కొక్కటిగా అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తం : శ్యామ్ మోహన్

ఒక్కొక్కటిగా అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తం : శ్యామ్ మోహన్

 హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నదని పీసీసీ మేధావుల సెల్ చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్ అన్నారు.  బుధవారం గాంధీ భవన్‌‌‌‌లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీ అసోసియేషన్ ప్రతినిధులతో పీసీసీ మేధావుల సెల్ సమావేశమైంది. ఈ సందర్భంగా తమ సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు పీసీసీ మేధావుల సెల్‌‌‌‌కు వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అనంతుల శ్యామ్ మోహన్ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై రూ.7లక్షల కోట్ల అప్పు మోపిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తూ వస్తున్నామని వెల్లడించారు. కాలేజీ యాజమాన్యాల ఇబ్బందులను తాము సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. విద్యారంగంలోని దోస్త్, ఆఫ్ లైన్ ఎడ్యుకేషన్ లాంటి అంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని శ్యామ్ మోహన్ పేర్కొన్నారు.