ఖరీదైన వీధుల లిస్టులో సోమాజీగూడకు 2వ ప్లేస్

ఖరీదైన వీధుల లిస్టులో సోమాజీగూడకు 2వ ప్లేస్
  • మొదటిస్థానంలో బెంగళూరు ఎంజీ రోడ్​

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలోనే అత్యంత ఖరీదైన వీధుల్లో (హై స్ట్రీట్స్​) హైదరాబాద్​లోని సోమాజిగూడ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బెంగళూరులోని ఎంజీ రోడ్​ ఉంది. సోమాజీగూడలో ఒక చదరపు అడుగుకు నెలకు రూ.150‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌175 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ముంబై లింకింగ్ రోడ్, ఢిల్లీ సౌత్ ఎక్స్​టెన్షన్​  పార్ట్ I & పార్ట్ II, కోల్​కతాలోని పార్క్ స్ట్రీట్,  కామాక్ స్ట్రీట్, చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, బెంగళూరు చర్చి స్ట్రీట్ మిగతా స్థానాల్లో ఉన్నాయి. మొత్తం పది మార్కెట్​ లొకేషన్లలో నాలుగు బెంగళూరులోనే ఉండటం గమనించదగ్గ విషయం.

గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియాలోని మొత్తం 30  మార్కెట్లలో  సర్వే నిర్వహించి ఈ రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం..యాక్సెస్​, పార్కింగ్, షాపులు వంటి పారామీటర్ల ఆధారంగా ఈ వీధులకు ర్యాంకులు ఇచ్చారు. సర్వే జరిపిన 30 హై స్ట్రీట్లలో అత్యధికంగా దుస్తుల స్టోర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పది వీధుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు బిలియన్​ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని నైట్​ఫ్రాంక్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. మనదేశంలో జరుగుతున్న రిటైల్​ లావాదేవీల్లో 24 శాతం వాటా ఎన్​సీఆర్​ మార్కెట్​నుంచే ఉంది. ఢిల్లీ ఖాన్​మార్కెట్, డీఎల్​ఎఫ్​ గలేరియా, ముంబై లింకింగ్​ రోడ్, టర్నర్​ రోడ్​లో అత్యధికంగా అద్దెలు వసూలు చేస్తున్నారు.