ఆత్మాహుతి బాంబు దాడిలో సోమాలియా గవర్నర్ మృతి

ఆత్మాహుతి బాంబు దాడిలో సోమాలియా గవర్నర్ మృతి

ఇస్లామిక్ టెర్రరిస్టులు జరిపిప ఆత్మాహుతి కారు బాంబు దాడిలో సోమాలియా గవర్నర్ తో పాటు మరో ముగ్గురు పోలీసులు చనిపోయారు. సోమాలియా సెమీ అటానమస్ స్టేట్ పంట్లాండ్‌లోని ముదుగ్ గవర్నర్ తన ముగ్గురు అంగరక్షకులతో ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఆదివారం చంపబడ్డారని ఇస్లామిస్ట్ గ్రూప్ అల్ షాబాబ్ పేర్కొంది. ఈ దాడి పూర్తి బాధ్యత తమదేనని అల్ షాబాబ్ తెలిపింది. ‘గవర్నర్ కారుపై ఆత్మాహుతి కారు బాంబు జరిగింది. ఈ దాడిలో గవర్నర్ అహ్మద్ మ్యూస్ నూర్ మరియు అతని ముగ్గురు అంగరక్షకులు చనిపోయారు’ అని పోలీసు కెప్టెన్ మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.

పశ్చిమ సోమాలియా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అల్ షాబాబ్ కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఆ దిశగా అల్ షాబాబ్ తరచూ ఈ ప్రాంతంలో బాంబు దాడులు చేస్తుంది. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం.. అల్ షాబాబ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశంలో తన స్వంత పాలనను స్థాపించాలనుకుంటుంది. ‘గవర్నర్ పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత మాదే. ఇది ఆత్మాహుతి కారు బాంబు. ఈ దాడిలో ముదుగ్ గవర్నర్ మరియు అతని ముగ్గురు అంగరక్షకులను చంపాం’అని అల్ షాబాబ్ యొక్క సైనిక కార్యకలాపాల ప్రతినిధి అబ్దియాసిస్ అబూ ముసాబ్ తెలిపారు.

For More News..

మద్యం మత్తులో ఇద్దరిపై బ్లేడుతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు

ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’