సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు షురూ

 సోమశిలలో స్పీడ్ బోట్ సేవలు షురూ
  •  సోమశిల - శ్రీశైలం క్రూయిజ్ లాంచీ జర్నీ 
  • నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ

కొల్లాపూర్, వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని కల్పించేందుకు ప్రభుత్వం స్పీట్ బోట్ల సేవలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ స్పీడ్ బోట్లను ప్రారంభించి టూరిస్టులకు అందుబాటులోకి తెచ్చారు. 

రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ నిధుల నుంచి 6 సీటర్ స్పీడ్ బోట్లకు నిధులు మంజూరు అయ్యాయి.  అదే విధంగా కృష్ణానదిలో పర్యాటకుల కోసం సోమశిల టు -శ్రీశైలం వరకు క్రూయిజ్ లాంచీ జర్నీ మంగళవారం ప్రారంభిస్తారు.  శ్రీశైలం వెళ్లాలనుకునే ప్రయాణికులు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారి సూచించారు.

  సోమశిల మాజీ సర్పంచ్ బింగి మద్దిలేటి, కాంగ్రెస్ నేత కేతూరి రంగస్వామి, కొల్లాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్వాల రమేశ్ గౌడ్, కొల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బింగి మహేష్ ,టూరిజం శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.