హైదరాబాద్లో అల్లర్లకు కొందరు కుట్ర: మంత్రి కేటీఆర్

హైదరాబాద్లో అల్లర్లకు కొందరు కుట్ర: మంత్రి కేటీఆర్
  • అందుకు కొందరు ప్రయత్నం చేస్తుండ్రు
  • ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
  • మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి
  • స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్లో కొందరు అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఏడాదికి పది రోజులు కర్ఫ్యూ ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కొందరు కులాలు, మతాల పేరుతో రాజధాని నగరంలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇందిరా పార్క్–వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆగస్టు 19న) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ బ్రిడ్జి ఏర్పాటుతో దశాబ్దపు కల నెరవేరిందన్నారు.
 ఈ బ్రిడ్జికి కార్మిక నాయకుడు, తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారన్నారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే యోచిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. కుల, మతాలతో సంబంధం లేకుండా పనిచేసేదే బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
 50 ఏండ్లు అధికారంలో ఉన్నా కొందరు దుర్మార్గులు హైదరాబాద్లో అల్లర్లకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.ఇది వారికి ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నడిచేది కాదని, 2023లో అధికారంలోకి వచ్చి అసలైన సినిమా చూపిస్తామని చెప్పారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.