Good Health:పడుకొనే ముందు ఇవి తినకూడదట.. ఎందుకంటే...

 Good Health:పడుకొనే ముందు ఇవి తినకూడదట.. ఎందుకంటే...

రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే వాటివల్ల నిద్రాభంగంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోఉ ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. కాని కొంతమంది నిద్రపోయో ముందు పాలు ... పండ్లు తీసుకుంటారు.  అయితే  పాలు తాగితేఇబ్బంది ఏమీ లేదు కాని కొన్ని రకాల పండ్లు తింటే చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అలాంటి పండ్లు ఏవి.. తింటే ఏమవుతుందో తెలుసుకుందాం..

  • బాగా పుల్లగా వుండే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే గుండెల్లో మంట వస్తుంది.  కనుక వీటిని తినరాదు.
  • పైనాపిల్ పండు కూడా ఆమ్లత్వం కలిగి వుంటుంది కనుక దీన్ని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణసమస్యలు తలెత్తుతాయి.
  • మామిడి పండ్లలో అధికస్థాయిలో షుగర్​ కంటెంట్​ ఉంటుంది.  వుంటాయి కనుక వీటిని పడుకునే ముందు తింటే షుగర్​ లెవల్స్​  పెరుగుతాయి.
  • అధికస్థాయిలో నీటిశాతం కలిగిన పుచ్చకాయలు తింటే రాత్రివేళ మూత్రానికి పలుమార్లు వెళ్లాల్సి ఉంటుంది.
  • పడుకోబోయే ముందు బొప్పాయిని కూడా తినకూడదు ఎందుకంటే ఇందులోని ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది
  • కివి పండ్లలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పటికీ రాత్రివేళ తింటే కడుపులో గడబిడ, గ్యాస్ సమస్యలు వస్తాయి. 
  • రాత్రి పడుకునే ముందు జామకాయలు తినరాదు ఎందుకంటే అవి తింటే అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
  • దానిమ్మ కాయలను కూడా రాత్రి పడుకునేముందు తినకపోవడమే మంచిది.