
సిటీలో మందు బాబులు, ఆకతాయిలు అర్ధరాత్రులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలాలు, పార్కులు, ఫ్లైఓవర్లపై తిష్టవేసి నానా రచ్చ చేస్తున్నారు. మద్యం తాగి గొడవ పడుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శనివారం రాత్రి కొందరు ఇందిరాపార్క్ నుంచి విద్యానగర్ వైపు ఉన్న స్టీల్ బ్రిడ్జిపై కొందరు సిట్టింగ్ వేసి మద్యం తాగారు. తర్వాత బీర్ బాటిల్స్ ను అక్కడే వదిలేసి వెళ్లారు. పోలీసులు అర్ధరాత్రిళ్లు పెట్రోలింగ్ పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.
- ఫొటోగ్రాఫర్, వెలుగు