టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
అయితే టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అన్నగారి జనత వస్త్రాలు- చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు ఒక్కసారిగా రావడంతో గందరగోళం ఏర్పడింది. ఒకరిపై ఒకరు ముందుకు తోసుకురావటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. అయితే సభా నిర్వహకులపై స్థానికులు మండిపడుతున్నారు.నాలుగు రోజుల క్రితమే నెల్లూరు జిల్లా కందూకూరులో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా తొక్కిసలాట జరగడంతో 8 మంది చనిపోయారు.
