హలీమ్ డబ్బుల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు

హలీమ్ డబ్బుల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు

హైదరాబాద్ లో హలీమ్ డబ్బుల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ముషీరాబాద్ 4 చిల్లీస్ హోటల్ దగ్గర నిన్న రాత్రి(మార్చి 29) కొంతమంది ముస్లిం యువకులు హల్ చల్ చేశారు. చొక్కాలు చించుకొని మరీ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. హలీం డబ్బులు చెల్లించే విషయంలో గొడవ జరిగిందని తెలుస్తుంది. డబ్బుల విషయంలో ఘర్షణకు దారి తీయడంతో రెండు వర్గాలుగా విడిపోయి.. ఒకరిని ఒకరు తిట్టుకోవడంతో గొడవ ప్రారంభమైంది..  అంతటితో ఆగకుండా 10 నిమిషాల పాటు కొట్టుకున్నారు. దీంతో భ్రయభ్రాంతులకు గురయ్యారు స్థానికలు. 

చిల్లీస్ హోటల్ ముషీరాబాద్ మెయిన్ రోడ్డునే ఉండటంతో.. ఈ గొడవ కారణంగా అక్కడ భారీగా జనాలు గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని వారి మధ్య గొడవను సద్దుమణిగింపజేశారు.