మండుతున్న అగ్ని గోళంలా సూర్యుడు.. నెట్‌లో నాసా ఫొటోలు వైరల్

మండుతున్న అగ్ని గోళంలా సూర్యుడు.. నెట్‌లో నాసా ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: అంతరిక్షం, గ్రహాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నాసా ఇచ్చే అప్‌డేట్స్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తుంటారు. అందుకు తగ్గట్లే తన రీసెర్చ్‌కు సంబంధించి విభిన్న ఫొటోలు, వీడియోలను నాసా విడుదల చేస్తుంటుంది. తాజాగా సూర్యుడికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇంటర్‌‌నెట్‌లో స్పేస్ సెంటర్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సోలార్ ఆర్బిటర్ మిషన్ సందర్భంగా తీసిన ఈ స్టన్నింగ్ ఫొటోలు వెబ్‌లో పెట్టినప్పటి నుంచి నెటిజన్స్ వీటిని షేర్ చేస్తున్నారు.

సూర్యుడి ఫొటోలను నాసా ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు ‘ఇవ్వాళ్టి స్పేస్ వాక్ ఇలాగే కొనసాగుతుంది. సైంటిస్టులు మళ్లీ భూమిని చేరాక సూర్యుడికి సంబంధించిన మరిన్ని క్లోజ్డ్‌ ఇమేజెస్‌ను రివీల్ చేస్తారు. ఈఎస్‌ఏతో కలిపి మేం చేసిన జాయింట్ మిషనే ఈఎస్‌ఏ సోలార్ ఆర్బిటర్‌‌’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. ఈఎస్ఏ కూడా సూర్యుడ్ని దగ్గర నుంచి తీసిన ఫొటోలను ఓ ట్వీట్‌లో పోస్ట్‌ చేసింది. చలిమంటతో ప్రయోజనాలు అనే క్యాప్షన్‌ను ఈ ట్వీట్‌కు యాడ్ చేసింది.