విద్యాశాఖ నిర్లక్ష్యం.. ఒకరి పేపర్‍కు బదులు మరొకరి పేపర్

విద్యాశాఖ నిర్లక్ష్యం.. ఒకరి పేపర్‍కు బదులు మరొకరి పేపర్

రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. టెన్త్ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయగా.. ఒకరి పేపర్‍కు బదులు మరొకరి పేపర్ పంపారు. అందులో కూడా ఇన్విజిలేటర్ పేర్లు, సంతకాలు మారడం గమనార్హం. OMR షీట్ పై భాగానికి కింది బాగానికి పొంతన లేదు. ఇన్విజిలేటర్ సంధ్యారాణి అయితే.. సంతకం మాత్రం వెంకటరావు పేరుపై ఉంది. ఎగ్జామ్ రాసే సమయంలో రెండు అడిషనల్ షీట్స్ తీసుకుంటే.. బోర్డు పంపిన పేపర్లో మాత్రం 3 షీట్స్ అదనంగా తీసుకున్నట్లు ఉంది. 

ఖమ్మం జిల్లా కామంచికల్ కు చేందిన శ్రీహరిణి.. అన్ని సబ్జెక్స్ట్ లోనూ 10కి 10 జీపీఏ సాధించింది. అయితే ఒక్క సోషల్ పేపర్ లో మాత్రం 9 జీపీఏ వచ్చింది. ఆపరీక్ష కూడా బాగా రాశానని భావించిన శ్రీహరిణి.. తక్కువ మార్కులు వచ్చినందున రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసింది. అందుకు స్పందించిన బోర్డు OMR షీటులోని మార్కుల జాబితాతో పాటు.. హరిణి ఆన్సర్ షీట్ ను కూడా పంపించారు. అది చూసిన శ్రీహరిణి ఆశ్చర్యపోయింది. పంపింది అసలు తన పేపరే కాదు. పరీక్ష రోజు మహిళా ఇన్విజిలేటర్ ఉండగా OMR షీట్ పై భాగంలోనే ఆమె సంతకం ఉంది. మిగిలిన అన్ని జవాబు పత్రాల్లో మాత్రం వేరే సంతకం ఉంది. అంతేకాదు ఆన్సర్ షీట్ లో చేతిరాత కూడా తనది కాదంటోంది హరిణి. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.