ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నదే తన కోరికంటూ.. మోడీ నాయకత్వంలోని రోడ్ మ్యాప్ తో ముందుకెళ్లామన్నారు సోము వీర్రాజు. పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై స్పందించిన ఆయన దానిని రాజకీయంగా మాత్రమే చూడాలని.. కులపరంగా చూడకూడదన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారని అన్నారు. ఏపీలో బీజేపిని ఓ అద్బుత శక్తిలా తీర్చిదిద్దుతామన్న ఆయన.. కేంద్రంలో తమ పాలన అద్భుతంగా ఉందని  ఏపీలో పాలన అవినీతిమయమంటూ... పరోక్షంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కౌంటర్ వేశారు. కొత్తగా రాష్ట్రాన్ని తినేసేందుకు.. పథకాలు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు

టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పారని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదని గుర్తు చేశారు. వాళ్లతో కలుస్తారా, వీళ్లతో కలుస్తారా అని ఎప్పుడు మమ్మల్నే ఎందుకు ప్రశ్నిస్తారు? అని నిలదీశారు. వారాహి యాత్రను బీజేపీతో కలిసి చేస్తారా? అని పవన్‌ను అడుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని పేర్కొన్నారు. బీజేపి చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు.  ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సోము వీర్రాజు పేర్కొన్నారు