బావను మోసం చేసిన బావమరిది

బావను మోసం చేసిన బావమరిది

జల్సాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి సొంత బావను మోసం చెయాలని చూశాడు. నలుగురు దోస్తులతో కలిసి 50లక్షలు కాజేయాలని పన్నాగం పన్ని కటకటాల పాలయ్యాడు. సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ కు చెందిన కాంతిలాల్ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్ లో తన వ్యాపారానికి సంబంధించిన నగదు వసూళ్ల బాధ్యత సొంత బావమర్ది అర్జున్ సింగ్ రాజ్ పుత్ కు అప్పగించాడు. ఈమధ్య వసూలైన రూ.50లక్షలను బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఇచ్చి తన బావకు ఇవ్వాలని సూచించాడు. సదరు వ్యక్తి నాంపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోగా నలుగురు వ్యక్తులు వెంబడించి తాము పోలీసులమని బెదిరించి డబ్బు లాక్కొని వెళ్లారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్జున్ సింగ్ పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టడంతో తానే నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనితోపాటు రాజ్ పుత్ ఉమ్డ్ సింగ్, భవర్ సింగ్ రాజ్ పుత్, ప్రవీణ్ సింగ్, విక్కీ రాజ్పుత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. వారినుండి 46 లక్షల 36 వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.