
జవహర్ నగర్, వెలుగు: గొడవలు పడొద్దని తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినకపోవడంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్ నగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ భాస్కర్ వివరాల ప్రకారం కాప్రా మండలం బీజేఆర్ నగర్లో ఉండే మణిదీప్ (20) డిగ్రీ చదువుతున్నాడు. అయితే అతని తల్లి రమ, తండ్రి రాములు నిత్యం గొడవ పడుతుండేవారు. మణిదీప్ఎన్నిసార్లు వారికి చెప్పినా తరచూ గొడవలు పడుతూనే ఉండేవారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మణిదీప్ శనివారం మధ్యాహ్నం తల్లి రమ ఇంట్లో ఉండగానే తన రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అది చూసిన తల్లి చుట్టు ప్రక్కల వారిని పిలిచి స్థానిక హాస్పిటల్‌కి తరలించింది. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.