
చేవెళ్ల, వెలుగు: తండ్రిని హత్య చేసిన కొడుకును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మొయినాబాద్ మండలం మూర్తుజాగూడకు చెందిన అజ్జూఖాన్(50) కూలీ పనులు చేస్తుంటాడు. పని చేస్తానని చెప్పి ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడు. కానీ పని చేయకపోవడంతో వారు నిలదీశారు. పనికి వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతుండడంతో కొడుకు అజీంఖాన్కు కోపం వచ్చింది. ఈ నెల 6న కర్రతో తండ్రిని విచక్షణారహితంగా కొట్టాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతిచెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అజీమ్ ఖాన్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.