
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ‘దచ్చన్న దారిలో..’ అనే పాటను చిత్రీకరించారు. నేర్నాల కిషోర్ రాసి, పాడడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు, మొలంగూర్ గుట్టలపై 200 మందికి పైగా కళాకారులపై చిత్రీకరించారు.
గద్దర్ వేషధారణలో ఏ.డీ.ఎం.ఎస్ శివాజీ ఆకట్టుకున్నారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో అమరుల కుటుంబాల చేతుల మీదుగా పాటను విడుదల చేయించారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ, సినీ దర్శకులు ఎన్ శంకర్, హీరో సంజోష్, ప్రజా నాట్య మండలి విమలక్క, విమల గద్దర్ (వెన్నెల) అతిధులుగా పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పాటను అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.