బీజేపీ ఎంపీ మాటలకు.. పగలబడి నవ్విన సోనియాగాంధీ

బీజేపీ ఎంపీ మాటలకు.. పగలబడి నవ్విన సోనియాగాంధీ

పార్లమెంట్ లో మంగళవారం రోజు (ఆగస్టు 8న) ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలతో లోక్ సభలో నవ్వులు పూశాయి. కాంగ్రెస్ పార్టీని.. సోనియాగాంధీని ఉద్దేశించి.. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన బీజేపీ ఎంపీ దూబే.. మీరు మీ కుమారుడిని ఓ దారికి తీసుకురావాలి.. అతన్ని సెట్ చేయాలి.. అదే విధంగా అల్లుడిని ప్రజెంట్ చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి.. ఇన్ని పనులను వదిలేసి మీరు ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారంటూ సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 

ఎంపీ దూబే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోని సోనియాగాంధీ... సభలోనే పగలబడి నవ్వారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మీ పార్టీని చూసుకోండి అంటూ బీజేపీ ఎంపీలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. మీ పార్టీని మీరు సెట్ చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ :రాజ్యసభలో తృణమూల్‌ ఎంపీ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశాలు వెలుగుచూశాయి. సభలో బీజేపీ, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. చర్చల సందర్భంగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మంగళవారం (ఆగస్టు 8న) సోనియాగాంధీపై విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. బేతే కో సెట్ కర్నా హై ఔర్ దామద్ కో భెంట్ కర్నా హై (మీరు మీ కుమారుడు రాహుల్​ గాంధీని ఓ దారికి తీసుకురావాలి.. అతన్ని సెట్ చేయాలి.. అదే విధంగా అల్లుడు ప్రియాంక భర్త రాబ్టర్​ వాద్రాను పాలిటిక్స్​ లో ప్రజెంట్ తీసుకురావాల్సిన పనులు) అని మాట్లాడడంతో సభలో నవ్వులు పూశాయి.  అంతేకాదు.. నేషనల్ హెరాల్డ్‌పై ఆదాయపు పన్ను కేసుపైనా వ్యంగ్యస్త్రాలు సంధించారు. రూ.5 వేల కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.లక్షలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాత్రమే కొనుగోలు చేయగలరు అని కామెంట్స్​ చేశారు.