తీహార్ జైళ్లో చిదంబరంను కలిసిన సోనియా గాంధీ

V6 Velugu Posted on Sep 23, 2019

తీహార్ జైళ్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కలిశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతీ విషయంలో మద్దతిస్తామని చిదంబరంకు భరోసా ఇచ్చారు సోనియా. ఈ రాజకీయ యుద్ధంలో సోనియా, మన్మోహన్ ల మీటింగ్ తమకు పెద్ద బూస్ట్ నిచ్చిందన్నారు చిదంబరం కొడుకు కార్తీ. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ప్రతిపాదనలపైనా చర్చ జరిగిందన్నారు కార్తీ.

Tagged Congress, Sonia Gandhi, chidambaram, manmohan singh

Latest Videos

Subscribe Now

More News