ప్రత్యేక హోమం చేసిన సోనియా గాంధీ..

V6 Velugu Posted on Apr 11, 2019

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి లోక్ సభకు  పోటీ చేస్తున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆమె ఇంట్లో  ప్రత్యేక హోమం, పూజలు చేశారు. ఈ  కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రియాంక, రాబర్ట్ వాద్రా పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గురువారం సాయంత్రం నామినేషణ్  వేయనున్నారు. వరుసగా ఐదోసారి సోనియాగాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీకి ప్రత్యర్థిగా  బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు.

Tagged ELECTIONS, filing, Sonia Gandhi, Nomination, performs, RaeBareli

Latest Videos

Subscribe Now

More News