సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ కానున్న ప్రతిపక్షాలు

సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ కానున్న ప్రతిపక్షాలు
  • వలస కార్మికుల సమస్యలపై చర్చించేందుకు
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్న 15 పార్టీల నేతలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు, లేబర్‌‌ లా కి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. దేశవ్యాప్తంగా ఉన్న 15 పార్టీలు ఈ మీటింగ్‌లో పాల్గనేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. వలస కార్మికులను కేంద్రం పట్టించుకోవడం లేదని, వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తోందని కాంగ్రెస్‌ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉంది. శ్రామిక్‌ రైళ్లలో వాళ్ల దగ్గర నుంచి టికెట్‌ ఫీజ్‌ వసూలు చేయడం అన్యాయమని, వాళ్ల టికెట్‌ డబ్బులు తానే భరిస్తానని సోనియా గాంధీ గతంలో ప్రకటించారు. రాహుల్‌ గాంధీ కూడా వలస కార్మికుల విషయంలో కేంద్రాన్ని విమర్శించారు.