రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర

 రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్ర

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. దారిపొడవునా ప్రజలతో మమేకం అవుతూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మైసూర్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన పాదయాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు.

ఈ నెల 6న మాండ్య జిల్లాలో నిర్వహించనున్న భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆమె ఇవాళ మైసూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సోనియా గాంధీకి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్వాగతం పలికారు. గురువారం ఉదయం రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు.