మీరు లేకుండా నా కుటుంబం అసంపూర్ణం.. రాయ్బరేలీ ప్రజలకు సోనియాగాంధీ లేఖ

మీరు లేకుండా నా కుటుంబం అసంపూర్ణం.. రాయ్బరేలీ ప్రజలకు సోనియాగాంధీ లేఖ

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియాగాంధీ లేఖ రాశారు. 2004 నుంచి రాయ్బరేలీ నుంచి ఎంపీ గా ఉన్న ఆమె..రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇకపై తాను రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందించనున్నారు.

లోక్సభ నుంచి రాజ్యసభకు మారాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ..తన నియోజకవర్గం రాయ్బరేలీ ప్రజలకు గురువారం (ఫిబ్రవరి 15)  హృదయపూర్వక లేఖ రాశారు. అనారోగ్య కారణంగా లోక్ సభనుంచి పోటీ చేయడం సాధ్యం కాదని ఆమె ఈ లేఖలో తెలిపారు. 

2004 నుంచి ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు సోనియాగాంధీ. గత ఎన్నికల్లో ఆమె కుమారుడు రాహుల్గాంధీ తన కుటుంబానికి కంచుకోట అయిన అమేథీలో బీజేపీకి చెందిన స్మృతి హిరానీ చేతిలో ఓడిపోయారు. అయితే సోనియాగాంధీ నిర్ణయంపై బీజేపీ స్పందిస్తూ..లోక్సభ నుంచి రాజ్యసభకు మారడానికి ఓడిపోతాననే భయం కారణమని బీజేపీ చెపుతోంది.