
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారం లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుచితంగా రూ. 142 కోట్ల లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని, కేసు కూడా నమోదు చేసిన ట్లు వెల్లడించింది. స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే వాదనలు విన్నారు.
2014లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేయగా.. 2021లో ఈడీ ఎంటరై దర్యాప్తును ప్రారంభించింది. 2023 నవంబర్లో ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ కేసులో సోనియా, రాహుల్, శామ్ పిట్రోడో, సుమన్ దుబే, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరో రెండు సంస్థలు నిందితులుగా ఉన్నారు.