మరో గొప్ప కార్యక్రమానికి సోనూసూద్ శ్రీకారం

V6 Velugu Posted on May 31, 2021

కరోనా కష్ట సమయంలో దేశ వ్యాప్తంగా తన సాయాన్ని అందించిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో గొప్ప సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నాడు సోనూసూద్. ఇందులో సానికిరెడ్డి పల్లి ఆషాపూర్ బోంకూర్ ఓర్వకల్ మడ్డికేరా,  ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాడు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో కొంత మంది గ్రామ సర్పంచ్ లు సాయం కోసం సోనూసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. త్వరలోనే ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చాడు.

Tagged Telangana, AP, sonu sood, Dead body, Mortuary, , freezer boxes, Telugu ststes

Latest Videos

Subscribe Now

More News