మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్ 

మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్ 

బాలీవుడ్ స్టార్ సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న హర్యానాకు చెందిన ప్రముఖ సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ కు సహయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంద్రజిత్ బార్కే అనే వ్యక్తి మమన్ ఖాన్ ఆరోగ్యం బాగోలేదని, ఆర్థిక పరిస్థితి కూడా బాలేదని అతనికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్..

"ఖాన్ సాహిబ్ ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా.. ఆ తరువాత మీ సారంగి పాట వింటా" అంటూ రీట్వీట్ చేశారు

మమన్ ఖాన్ ఎవరు? 

83 సంవత్సరాలు ఉన్న మమన్ ఖాన్ హిసార్ జిల్లా ఖరక్ పూనియా గ్రామానికి చెందిన వారు. తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండి ఆయన సారంగిని వాయిస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. హర్యానా ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వం అతనికి పౌర సంబంధాల శాఖలో ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆయన రాష్ట్రపతి నుంచి కూడా అవార్డు అందుకున్నారు. . మమన్ ఖాన్ తాత, తండ్రి జింద్ మహారాజా ఆస్థానంలో సారంగి వాయిద్యకారులు. ట్రైన్ టు పాకిస్థాన్ సినిమాలో తనదైన సారంగి ట్యూన్ ఉందని మమన్ ఖాన్ చెప్పేవారు.