వైద్యానికి సాయం కావాలంటే నన్ను అడగండి : సోనూసూద్ 

వైద్యానికి సాయం కావాలంటే నన్ను అడగండి : సోనూసూద్ 

శంషాబాద్, వెలుగు: శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దాంతి గ్రామం 17వ వార్డులో కందకట్ల సిద్దురెడ్డి  రూ. 70 లక్షల సొంత నిధులతో నిర్మించిన స్కూల్ భవనాన్ని నటుడు సోనూసూద్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం సోనూసూద్‌ మాట్లాడుతూ..  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హస్పిటల్స్ తో పాటు ఏదైనా సాయం కావాలంటే తనను సంప్రదించాలని కోరారు.

ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సిద్దు రెడ్డి నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.  ఎన్నో వసతులను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి నిర్మించారని తెలిపారు.   అనంతరం సిద్దు రెడ్డి మాట్లాడుతూ.. శంషాబాద్‌తో తనకు ఎంతగానో అనుబంధం ఉందని చెప్పారు.