SONY: సోనీ స్టూడియో మూసివేత... 900మంది ఉద్యోగాల కోత..!

SONY: సోనీ స్టూడియో మూసివేత... 900మంది ఉద్యోగాల కోత..!

ప్రముఖ కార్పొరేట్ సంస్థ సోనీకి చెందిన లండన్ స్టూడియోను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 900మంది ఉద్యోగాలకు కోత పడింది. సోనీ గ్రూప్ లో వీడియో గేమ్ డివిజన్ లోని ప్లే స్టేషన్ కంపెనీని, లండన్ లో ఉన్న స్టూడియోను మూసివేస్తున్నటు సంస్థ సీఈఓ జిమ్ ర్యాన్ ఉద్యోగులకు రాసిన ఒక లేఖలో తెలిపారు.

సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 900 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా జరిపిన చర్చల్లో భాగంగా సంస్థ అభివృద్ధి కోసం కొన్ని మార్పులు తప్పనిసరి అన్న నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్లే స్టేషన్ సంస్థ సీఈఓ హెర్మన్ హల్స్ విడుదల చేసిన ఇంకొక నోట్ లో లండన్ లోని తమ స్టూడియోను మూసివేయాలని నిరణించినట్లు తెలిపారు.

సోనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ సంస్థకు చెందిన నాటి డాగ్, ఇన్సోమ్నియాక్ గేమ్స్, కంపెనీలలోని టెక్నీకల్, సపోర్ట్ టీమ్స్ లో కూడా ఉద్యోగాలలో కోత పడనుందని తెలిపింది.మొత్తానికి సోని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీడియో గేమ్ రెంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న ప్లే స్టేషన్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.